News February 5, 2025

స్కూల్‌లో కాల్పులు.. 10 మంది మృతి

image

స్వీడన్‌ ఒరెబ్రో సిటీలోని ఓ విద్యాసంస్థలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. చనిపోయిన వారి వయసును, వారిలో విద్యార్థులు, టీచర్లు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్లు వివరించారు. అనుమానిత దుండగుడిని కూడా హతమార్చినట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇదొక భయంకరమైన ఘటన అని చెప్పారు.

Similar News

News November 4, 2025

చిన్నారి వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

image

AP: 2010 జనవరి 30న VJAలో అపహరణ, హత్యకు గురైన చిన్నారి వైష్ణవి కేసులో శిక్ష రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్‌లోని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.

News November 4, 2025

BCలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0: సవిత

image

AP: BCల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్ షాప్‌ను ప్రారంభించారు. ‘BCలు సమిష్టిగా కూటమిని గెలిపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే BCలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాం. వారి కాళ్లపై వారు నిలబడాలని ఆదరణ 3.0 పథకం అమలు చేస్తున్నాం. దానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం’ అని తెలిపారు.

News November 4, 2025

షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్: లారా

image

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్. WC పైనల్‌లాంటి మ్యాచుల్లో పార్ట్‌టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.