News February 5, 2025
స్కూల్‌లో కాల్పులు.. 10 మంది మృతి

స్వీడన్ ఒరెబ్రో సిటీలోని ఓ విద్యాసంస్థలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. చనిపోయిన వారి వయసును, వారిలో విద్యార్థులు, టీచర్లు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్లు వివరించారు. అనుమానిత దుండగుడిని కూడా హతమార్చినట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇదొక భయంకరమైన ఘటన అని చెప్పారు.
Similar News
News January 14, 2026
గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుకతో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉండడం వల్ల శిశువులు అధిక బరువు, గుండె జబ్బులు, మల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ D లోపం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News January 14, 2026
డెయిరీఫామ్.. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్ పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, గేదెలున్నాయి. రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తూ 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలు అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు. ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయమే లక్ష్యమంటున్నారు. ఈమె సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 14, 2026
వినాశకర పరిణామాలుంటాయ్.. అమెరికాకు రష్యా పరోక్ష హెచ్చరిక

ఇరాన్‌లో అమెరికా జోక్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా తెలిపింది. ‘2025 జూన్‌లో ఇరాన్‌పై చేసిన దాడిని రిపీట్ చేయాలనుకునేవారు, బయటి శక్తుల ప్రేరేపిత అశాంతిని వాడుకోవాలనుకునేవారు.. అటువంటి చర్యల వల్ల మిడిల్‌ఈస్ట్‌లో పరిస్థితులపై, అంతర్జాతీయ భద్రతపై ఉండే వినాశకరమైన పరిణామాల పట్ల అలర్ట్‌గా ఉండాలి’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ నిరసనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ ప్రకటించారు.


