News March 19, 2024
పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్లోనే ఉంటా: ఎర్రబెల్లి
TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ‘నేను పార్టీ మారడం లేదు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తా’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News October 31, 2024
Investing: ఈ వయసు వారే అత్యధికం
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారిలో 30 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరు 2018లో 22.9% ఉండగా Sep, 2024 నాటికి వారి సంఖ్య 40 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ ట్రెండ్ వెల్త్ క్రియేషన్‌పై ఆర్థిక అవగాహనతో పెట్టుబడులు పెట్టాలన్నయువత ఉత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, 30 ఏళ్లు పైబడిన వారిలో ఇన్వెస్టింగ్ ధోరణి క్రమంగా తగ్గుతున్నట్టు NSE నివేదిక వెల్లడించింది.
News October 31, 2024
తిరోగమనంలో విద్యారంగం: YCP
ఏపీలో సర్కార్ విద్యకి CM చంద్రబాబు మంగళం పాడారని YCP మండిపడింది. దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంది. ‘ఇంగ్లీషు మీడియం, CBSE, టోఫెల్ రద్దు. తల్లికి వందనమంటూ అమ్మఒడికి ఎగనామం. ఫీజు రీయింబర్స్మెంట్కి తిలోదకాలు. అధ్వాన్నంగా మారిన స్కూళ్లు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆస్పత్రిపాలు. కూటమి 5 నెలల పాలనలో తిరోగమనంలో విద్యారంగం’ అని Xలో విమర్శలు గుప్పించింది.
News October 31, 2024
ALERT.. కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.