News March 19, 2024
పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్‌లోనే ఉంటా: ఎర్రబెల్లి
TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ‘నేను పార్టీ మారడం లేదు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తా’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 16, 2024
ఇండియాలో ఎక్కువ మందికి ఉన్న చివరి పేరు ఇదే!
ఒకరిని పోలిన వ్యక్తులు భూమిపై ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఒకే పేరును కలిగిన వాళ్లు వేలల్లో ఉంటారు. అయితే, ఇండియాలో ఎక్కువ మంది తమ చివరి పేరును కుమార్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. అర్జెంటీనాలో గొంజాలెజ్, ఆస్ట్రేలియాలో స్మిత్, బంగ్లాదేశ్‌లో అక్తర్, బ్రెజిల్‌లో డా సిల్వా, కెనడాలో స్మిత్, చైనాలో వాంగ్, ఈజిప్టులో మొహమ్మద్, ఫ్రాన్స్‌లో మార్టిన్ అనే పేర్లు కామన్‌గా పెట్టుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది.
News September 16, 2024
నేడు కొరియాతో టీమ్ ఇండియా సెమీస్ పోరు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఈరోజు సెమీస్ మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొరియాతో ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఐదింటికి ఐదు మ్యాచులనూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన సునాయాసంగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అటు పాక్ కూడా సెమీస్ చేరి ఈరోజు చైనాతో తలపడుతోంది. ఈ నెల 17న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
News September 16, 2024
సీఎం రేవంత్ నన్ను చంపాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే కౌశిక్
TG: తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలి. హామీల అమలు గురించి అడిగితే దాడి చేయిస్తున్నారు. దాడి చేయించానని స్వయంగా ఆయనే చెప్పారు. రేవంత్‌కు నేను భయపడను. చావడానికైనా సిద్ధం. దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.