News February 5, 2025
US సాయం నిలిపివేత… భారత్‌పై ప్రభావం ఎంతంటే.?

విదేశాలకు అమెరికా అందించే సాయం USAID. భారత్‌లోనూ ఎన్నో ఏళ్లుగా ఈ సాయం కొనసాగుతోంది. దీని ద్వారా గత ఏడాది భారత్‌కు రూ.1228 కోట్లు అందాయి. క్షయ, HIV నివారణకు, లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణానికి యూఎస్ఎయిడ్ ఉపకరించింది. అయితే ఆ నిధుల నిలిపివేత ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపొవచ్చు. మొత్తంగా ఏటా 160దేశాలకు సాయం చేసేందుకు రూ.3.83 లక్షల కోట్ల మేర నిధుల్ని అమెరికా వెచ్చిస్తోంది.
Similar News
News March 25, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం!

TG: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ తగ్గుముఖం పట్టింది.
News March 25, 2026
2 నెలలకు సరిపడా నిల్వలున్నాయి: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2 నెలలకు సరిపడా నిల్వలున్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోజువారీ పెట్రోల్, డీజిల్ డిమాండ్ 25% పెరిగిందని చెప్పారు. ట్యాంకర్ల ఆలస్యం కారణంగా, కొన్ని పెట్రోల్ పంపులు మూసివేశారని పేర్కొన్నారు. దేశంలో 60 రోజుల పెట్రోలియం నిల్వలు ఉన్నాయన్నారు. ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని HYD CP సజ్జనార్ తెలిపారు.
News March 25, 2026
86 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), తిరుచిరాపల్లి కాంట్రాక్ట్ పద్ధతిలో 86 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిగ్రీ, BE/BTech,ME/ఎంటెక్/Msc,MA/ఎంఈడీ/Phdతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో 06.04.26, ఆఫ్‌లైన్‌లో 16.04.26 వరకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు www.nitt.edu చూడండి.


