News February 5, 2025

US సాయం నిలిపివేత… భారత్‌పై ప్రభావం ఎంతంటే.?

image

విదేశాలకు అమెరికా అందించే సాయం USAID. భారత్‌లోనూ ఎన్నో ఏళ్లుగా ఈ సాయం కొనసాగుతోంది. దీని ద్వారా గత ఏడాది భారత్‌కు రూ.1228 కోట్లు అందాయి. క్షయ, HIV నివారణకు, లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణానికి యూఎస్ఎయిడ్ ఉపకరించింది. అయితే ఆ నిధుల నిలిపివేత ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపొవచ్చు. మొత్తంగా ఏటా 160దేశాలకు సాయం చేసేందుకు రూ.3.83 లక్షల కోట్ల మేర నిధుల్ని అమెరికా వెచ్చిస్తోంది.

Similar News

News February 8, 2026

గోవా వెళ్తున్నారా? ఈ పని చేస్తే 24 గంటలు జైలులో ఉండాల్సిందే

image

గోవాలో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలు జైలులో గడపాల్సిందే. పర్మిషన్ లేకుండా విదేశీయులు/ఇండియన్స్ ఫొటోలు తీసినా, సెల్ఫీలకు వేధించినా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల నిర్ణయంపై SMలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నార్త్ గోవా బాగా బీచ్‌లో టూరిస్టులను వేధించిన తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

News February 8, 2026

మరణించినవారి ఫొటోలు ఎక్కడ ఉంచాలంటే?

image

చనిపోయిన వారి ఫొటోలను పూజా మందిరంలో దేవుడి పటాలతో కలిపి పెట్టకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది వాస్తురీత్యా తప్పని వివరిస్తున్నారు. ‘మరణించిన వారు ఎంతటి వారైనా దేవుళ్లతో సమానం కాదు. వారి ఫొటోలను యమస్థానమైన దక్షిణ వైపు గోడలకు తగిలించడం మంచిది. వారి ఫొటోలు హాలులో కూడా ఉంచకూడదు. లేకపోతే ఇంట్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. శాస్త్రనియమాలను అనుసరించి సరైన దిశలో ఉంచాలి’ అన్నారు. <<-se>>#Vasthu<<>>

News February 8, 2026

13.06% పెరిగిన SBI లాభం

image

SBI బ్యాంకు లాభం 13.06% పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం DEC క్వార్టర్‌లో రూ.21,028 కోట్ల నికర లాభాన్ని పొందింది. మొత్తం ఆదాయంలో 9.7%వృద్ధి సాధించింది. ఏకీకృత అకౌంట్ల ప్రకారం నికర లాభం రూ.21,317 కోట్లుగా నమోదైంది. 9.4% వృద్ధితో నికర వడ్డీ ఆదాయం రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం రూ.3,823కోట్లుగా ఉన్న మొండి బకాయిలు రూ.4,458 కోట్లకు చేరినట్టు బ్యాంక్ ఛైర్మన్ తెలిపారు.