News March 19, 2024
జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఖరారు
AP: సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పులివెందుల, కమలాపురం మీదుగా సీఎం ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం ప్రాంతాల్లో ప్రయాణిస్తారు. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యాత్రపై పూర్తి వివరాలను వైసీపీ నేతలు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.
Similar News
News January 8, 2025
వైకుంఠ దర్శనం కోరితే వైకుంఠానికి పంపుతారా: VHP
తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
News January 8, 2025
క్లీంకారకు నేనిచ్చే పెద్ద గిఫ్ట్ అదే: రామ్ చరణ్
మొదట కూతురు పుట్టాలనే తాను అనుకున్నట్లు హీరో రామ్ చరణ్ చెప్పారు. అదే సమయంలో ఒకటే సినిమా చేయడంతో క్లీంకారతో గడిపే సమయం దొరికిందన్నారు. షూటింగ్ ఉన్నా లేకున్నా రోజు రెండు గంటలు తనతో ఉంటానని పేర్కొన్నారు. ఒక్క ముద్ద తినేందుకు కిలోమీటర్ పరిగెడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో బర్త్ డే వీడియో ప్లే చేయగా ఆయన ఎమోషనల్ అయ్యారు. క్లీంకారకు ప్రైవసీ ఇవ్వడమే తాను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలిపారు.
News January 8, 2025
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.