News March 19, 2024
జగన్ బస్సుయాత్ర షెడ్యూల్ ఖరారు

AP: సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పులివెందుల, కమలాపురం మీదుగా సీఎం ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం ప్రాంతాల్లో ప్రయాణిస్తారు. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యాత్రపై పూర్తి వివరాలను వైసీపీ నేతలు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.
Similar News
News November 7, 2025
న్యూస్ అప్‌డేట్స్ @10AM

*గన్నవరం చేరుకున్న ప్రపంచకప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ
*BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో రైడ్స్ ఏంటని రవీందర్ రావు ఆగ్రహం
*ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 100కు పైగా ఫ్లైట్లు ఆలస్యం
News November 7, 2025
నాకు విజయ్‌తో శత్రుత్వం లేదు: అజిత్

కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్‌పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్‌తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్‌కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
News November 7, 2025
లావెండర్ నూనెతో మేనికి మెరుపు

అందాన్ని పెంచడంలో ఎసెన్షియల్ ఆయిల్స్ కీలకంగా పనిచేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది లావెండర్ ఆయిల్. దీన్ని ఎలా వాడాలంటే..* 2చుక్కల లావెండర్ నూనెని పావుకప్పు బ్రౌన్ షుగర్‌లో కలిపి, స్నానం చేసేముందు ఒంటికి రుద్దుకోవాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మొటిమలు, యాక్నేను తగ్గిస్తుంది. * అరటిపండు గుజ్జు, తేనె, 2చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.


