News February 5, 2025
JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్

ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.
Similar News
News April 2, 2026
సిరిసిల్ల: ఇసుక తరలింపులో పారదర్శకత అవసరం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక తరలింపులో పారదర్శకత కోసం ‘మన ఇసుక వాహనం’ అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, అప్లికేషన్ డౌన్లోడ్, ఆన్లైన్ లో అనుమతులు జారీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, గ్రామ పాలన అధికారులకు అవగాహన కల్పించారు.
News April 2, 2026
చద్దాకు వెల్లువెత్తుతున్న మద్దతు!

రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా <<19547250>>రాఘవ్ చద్దా<<>>ను ఆప్ తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. SMలో ఆయనకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పక్షాన నిలబడిన MPకి ఇచ్చే గౌరవం ఇదా అని నిలదీస్తున్నారు. ఆయనకు అన్యాయం జరిగిందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలగింపునకు గల కారణాలను పార్టీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీంతో చద్దాకు, పార్టీకి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
News April 2, 2026
అంబ’s రివెంజ్.. తెలుగులో తొలి ఏఐ చిత్రం!

‘‘అంబ’s రివెంజ్’’ పేరుతో తెలుగులో తొలి ఏఐ చిత్రం రూపొందుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మహాభారతంలోని అంబ కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీష్ముడిపై ఆమె పెంచుకున్న పగ, ప్రతీకారం వెనుక ఉన్న ఆవేదనను చూపించబోతున్నారు. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ కాగా, శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు.


