News February 5, 2025
ట్రంప్ నిర్ణయాలు.. ఆ ఆలయాలకు పెరిగిన భక్తులు!

US వీసా నిబంధనల్ని ట్రంప్ సర్కారు మరింత కఠినతరం చేస్తుండటంతో భారతవ్యాప్తంగా ఉన్న ‘వీసా’ దేవుళ్లకు భక్తుల తాకిడి పెరిగింది. ట్రంప్ వచ్చాక TGలోని చిలుకూరు బాలాజీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వీసా హనుమాన్, పంజాబ్‌లోని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా, ఢిల్లీలోని శ్రీ సిద్ధిపీఠ్ చమత్కారీ హనుమాన్, చెన్నైలోని శ్రీలక్ష్మీ వీసా గణపతి ఆలయాలకు రద్దీ భారీగా పెరిగిందని ఆయా ఆలయాల అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 25, 2026
టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి సమాచారం రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.
News March 25, 2026
SRHకు కావ్య, RCBకి అనన్య

IPLలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రత్యేక ఆకర్షణగా మారగా ఇప్పుడు ఆమెకు పోటీగా మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా కన్సార్షియం రూ.16,725 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఫ్రాంచైజీ ఛైర్మన్ ఆర్యమాన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్‌గా మారి, మ్యాచులు చూసేందుకు వస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
News March 25, 2026
ఇంధన కొరత లేదు.. అసలు సమస్య ఇదే: AP డీలర్ల అసోసియేషన్

AP: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు Way2Newsకు తెలిపారు. అయితే ముందు రోజు డబ్బు కడితేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని ప్రభుత్వ కంపెనీల యాజమాన్యం చెప్పిందని, దీంతో డబ్బుల్లేక కొన్ని బంకులు మూతపడుతున్నాయని చెప్పారు. ఈనెల 27నుంచి బ్యాంకులకు సెలవులు ఉండటంతో అడ్వాన్స్ చెల్లించే పరిస్థితి లేదని, ఈ 3 రోజులు వెసులుబాటు కల్పించకపోతే భారీగా బంకులు మూతపడే అవకాశం ఉందంటున్నారు.


