News February 5, 2025

ట్రంప్ నిర్ణయాలు.. ఆ ఆలయాలకు పెరిగిన భక్తులు!

image

US వీసా నిబంధనల్ని ట్రంప్ సర్కారు మరింత కఠినతరం చేస్తుండటంతో భారతవ్యాప్తంగా ఉన్న ‘వీసా’ దేవుళ్లకు భక్తుల తాకిడి పెరిగింది. ట్రంప్ వచ్చాక TGలోని చిలుకూరు బాలాజీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వీసా హనుమాన్, పంజాబ్‌లోని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా, ఢిల్లీలోని శ్రీ సిద్ధిపీఠ్ చమత్కారీ హనుమాన్, చెన్నైలోని శ్రీలక్ష్మీ వీసా గణపతి ఆలయాలకు రద్దీ భారీగా పెరిగిందని ఆయా ఆలయాల అధికారులు చెబుతున్నారు.

Similar News

News January 22, 2026

టెన్త్, ఐటీఐతో 210 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 22, 2026

CSLలో 260 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(<>CSL<<>>) 260 వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 7వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత విభాగంలో ITI, NTCతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in

News January 22, 2026

గ్రీన్‌లాండ్‌ స్ట్రాటజిక్ లొకేషన్.. ట్రంప్ ప్రేమకు కారణమిదే!

image

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడానికి ప్రధాన కారణం దాని స్ట్రాటజిక్ లొకేషన్. ఆర్కిటిక్ రీజియన్‌లో అది ఒక గేట్ వే లాంటిది. అక్కడ USకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్ ఉంది. ఇది రష్యా కదలికలను గమనించడానికి చాలా కీలకం. అలాగే మంచు కరుగుతుండటంతో కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇవి బిజినెస్‌కి ప్లస్ పాయింట్. అక్కడ భారీగా అరుదైన భూ మూలకాలు, బంగారం, ఆయిల్ నిక్షేపాలూ ఉన్నాయి.