News February 5, 2025
హీరోపై కేసు నమోదు!

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
Similar News
News March 25, 2026
HYD: టెన్షన్ వద్దు.. 8008553069 కాల్ చేయండి..!

పరీక్షలంటేనే పరేషాన్ అవుతున్నారా? అయితే మీకోసం సైకాలజిస్టులు రెడీగా ఉన్నారు. తెలంగాణ పదో తరగతి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (APA ఇండియా) ఉచిత టెలి కౌన్సెలింగ్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 105 మంది నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థుల ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆందోళనగా ఉంటే వెంటనే 8008553069, 8686444200 నంబర్లకు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చు.
News March 25, 2026
MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.