News February 5, 2025
హీరోపై కేసు నమోదు!

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
Similar News
News February 8, 2025
తొలిసారి ‘ఆప్’కు 48 రోజులే అధికారం

మూడో సారి అధికారం చేజిక్కించుకోవడానికి CM పదవికి సైతం దూరంగా ఉంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహప్రతివ్యూహాలు రచించారు. BJPపై ఘాటు విమర్శలు చేస్తూనే హామీలు గుప్పించారు. కాగా, తొలిసారి 2013లో అధికారం చేపట్టిన ఆప్ కాంగ్రెస్ మద్దతుతో కేవలం 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆపై 2015 నుంచి రెండు సార్లు విజయం సాధించింది. నాలుగోసారి ఆప్ గెలుస్తుందని అనుకుంటున్నారా?
News February 8, 2025
ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన ఇదే

మస్తాన్ సాయి <<15351108>>ప్రైవేట్ వీడియోల<<>> వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరును ప్రస్తావించడంపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబసభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
News February 8, 2025
శ్రీకాకుళంలోని ఆ 104 గ్రామాల్లో ‘తండేల్’ కథలే!

AP: శ్రీకాకుళం (D) K.మత్య్సలేశంకు చెందిన రామారావు, కొందరు జాలర్ల వాస్తవిక జీవితం ఆధారంగా తీసిన మూవీ ‘తండేల్’. అయితే జిల్లాలోని 193KM తీర ప్రాంతంలో ఉన్న 104మత్స్యకార గ్రామాల్లో ఇలాంటి కథలే కన్పిస్తాయి. ఫిషింగ్ హార్బర్లు లేక కొందరు నాటు పడవలపై ప్రమాదకరంగా చేపల వేట చేస్తున్నారు. వేలాదిగా ముంబై, వీరావల్(గుజరాత్) పోర్టులకు వలస వెళ్లి వ్యాపారుల వద్ద పనుల్లో చేరి దాదాపు సముద్రానికే అంకితమవుతున్నారు.