News February 5, 2025
TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ
AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News February 5, 2025
భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.
News February 5, 2025
ఇదేం ప్రశ్న: రోహిత్ అసహనం
ENGతో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఓ ప్రశ్నకు రోహిత్ అసహనం వ్యక్తం చేశారు. CT తర్వాత హిట్‌మ్యాన్ రిటైర్ అవుతారనే వార్తలు రాగా ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న. త్వరలో వన్డే సిరీస్, CT జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు ముఖ్యం. ఈ టైంలో నా భవిష్యత్తు గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం. ఏవో వార్తల గురించి మాట్లాడటానికి నేను లేను’ అని రోహిత్ అన్నారు.
News February 5, 2025
వారికి ఉచిత రేషన్ రద్దు?
దేశంలో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా గతేడాది జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. PMGKAY కింద పేదలకు కేంద్రం 5 కిలోల బియ్యం/గోధుమలు ఇస్తోంది.