News February 5, 2025

TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ

image

AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Similar News

News February 18, 2025

SI పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం

image

AP: పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. SI(సివిల్) పోస్టులను 65%(గతంలో 55%) డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలంది. గత ఏడాది జులై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందినవారికి కేటగిరీలను బట్టి 5-25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది.

News February 18, 2025

ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు?

image

TGలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా APలో ఎదురుచూపులు తప్పడం లేదు. గత జులై, ఆగస్టులోనే మంజూరు చేస్తామని కూటమి ప్రకటించినా ఇప్పటికీ పురోగతి లేదు. కొత్త కార్డులు, మార్పులు చేర్పులకు YCP హయాంలోనే 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు అవకాశం కల్పిస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. త్వరగా ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
* ఈ అంశంపై మీ కామెంట్

News February 18, 2025

అంగన్వాడీలకు గుడ్ న్యూస్

image

AP: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులివ్వనుంది. దీంతో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లక్ష మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు ఇస్తున్న ₹లక్ష మొత్తం సగటున ₹1.55 లక్షలకు పెరగనుంది. సర్వీసును బట్టి కొందరికి ₹2-2.5L అందనుంది. ఆయాలకు ఇచ్చే ₹40K సగటున ₹65-75Kకు చేరనుంది.

error: Content is protected !!