News February 5, 2025

నిర్మల్: అధికారులకు కలెక్టర్ సూచనలు

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా, నర్సాపూర్ (జి) ఆసుపత్రుల్లో ఇప్పటివరకు జరిగిన సిజేరియన్, సాధారణ ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితంగా ప్రసవాలు జరుగుతాయని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News February 6, 2025

పనులను త్వరగా పూర్తి చేయాలి: ASF అదనపు కలెక్టర్

image

జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి గమ్మనియల్‌, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు.

News February 6, 2025

కామారెడ్డి: జిల్లా అధ్యక్షురాలి నియామకం

image

మహిళా కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా పాక జ్ఞానేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. రెండోసారి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 6, 2025

సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

image

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.

error: Content is protected !!