News February 6, 2025
సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
ఆన్‌లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం

AP: నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు CM చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. ‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. YS వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
News March 26, 2025
IPL: టేబుల్ టాపర్‌గా SRH

IPL-2025లో ఇప్పటివరకు 5 మ్యాచులు పూర్తవగా, ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 5 జట్లు (SRH, RCB, PBKS, CSK, DC) విజయం సాధించగా, మిగతా 5 జట్లు (LSG, MI, GT, KKR, RR) ఓటమిని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH తొలి స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా RCB, PBKS, CSK, DC, LSG, MI, GT, KKR, RR ఉన్నాయి.
News March 26, 2025
ప్రజలకు ప్రభుత్వం ‘ఉగాది కానుక’

TG: రేషన్‌కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.