News February 6, 2025

KKD: డ్రోన్స్ వినియోగంపై పోలీసులకు శిక్షణ

image

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 మంది పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు డ్రోన్స్ వినియోగంపై ఎస్పీ బిందు మాధవ్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న శిక్షణను ఎస్పీ పరిశీలించారు. శిక్షణ తీసుకున్న వారితో ఎస్పీ మాట్లాడారు. గతంలో సీసీ కెమెరాలు, ఇప్పుడు డ్రోన్స్ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

Similar News

News February 6, 2025

చైనా టెలికాం కంపెనీకి యూజర్ల లాగిన్ డేటా

image

చైనా డీప్‌సీక్‌తో యూజర్ల డేటా భద్రతకు ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. US నిషేధిత చైనా ప్రభుత్వ టెలికాం కంపెనీ(చైనా మొబైల్)తో డీప్‌సీక్‌కు సంబంధాలు ఉన్నాయంటున్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్ల లాగిన్ సమాచారాన్ని టెలికాం సంస్థకు పంపుతోందని పేర్కొంటున్నారు. కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ తొలుత దీన్ని గుర్తించింది. ఇప్పటికే డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ నిషేధించాయి.

News February 6, 2025

KMM: గుడ్ న్యూస్.. ఒకేషనల్ స్టూడెంట్స్‌కు ఆహ్వానం

image

ఇంటర్మీడియట్ MPHW(ఫిమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే.రవిబాబు ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారు రూ.1000 ఆసుపత్రి పేరున డీడీ చెల్లించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.

News February 6, 2025

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా మహాశిరాత్రికి(ఫిబ్రవరి 26) ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటిదాకా మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించేవారు. ఈసారి సీఎం హాజరుకానున్నారు.

error: Content is protected !!