News February 6, 2025

సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

image

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.

Similar News

News February 6, 2025

విదేశీ పోర్న్ సైట్లలో మస్తాన్ వీడియోలు.. రూ.లక్షల్లో సంపాదన

image

TG: అమ్మాయిలతో మస్తాన్ సాయి అభ్యంతరకర వీడియోల కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అతను వందలాది వీడియోలను విదేశీ పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసి రూ.లక్షలు ఆర్జించేవాడని వెల్లడైంది. పార్టీల పేరుతో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరించేవాడని లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న పోలీసులు డ్రగ్స్ టెస్టు చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది.

News February 6, 2025

కొత్త అగాఖాన్ ఎవరంటే..

image

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కరీమ్ అల్-హుసేనీ (49వ అగాఖాన్) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం 50వ అగాఖాన్‌గా ఆయన తనయుడు రహీమ్(53 ఏళ్లు) అల్-హుసేనీ కొనసాగుతారని అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. అగాఖాన్‌ను మహ్మద్ ప్రవక్తకు ప్రత్యక్ష వారసుడిగా, ఇమామ్‌గా ఇస్మాయిలీ ముస్లింలు భావిస్తారు. 50 తరాలుగా ఆ కుటుంబం తరఫున అగాఖాన్ నియామక సంప్రదాయం కొనసాగుతోంది.

News February 6, 2025

ప్రైవేటు స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచుకోవచ్చు: కమిషన్

image

TG: ప్రైవేటు స్కూళ్లు ఏడాదికోసారి ట్యూషన్ ఫీజును పెంచుకోవచ్చని విద్యాకమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులివే: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయుల్లో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలుండాలి. ఇవి ఫీజుల్ని నియంత్రిస్తాయి. ఎక్కువ వసూలు చేసే స్కూళ్లకు భారీ జరిమానా విధిస్తారు. ఫీజుల వివరాలను అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలి.

error: Content is protected !!