News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News February 6, 2025

నటనలో ఎన్టీఆర్‌ను మించిన చంద్రబాబు: జగన్

image

AP: చంద్రబాబు నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని అన్నారు. 9 నెలల పాలన తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీగా మారిందని దుయ్యబట్టారు. చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పారు. CBN మోసాలను, అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

News February 6, 2025

కోడేరులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

image

కోడేరు మండల కేంద్రంలోనికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. చిన్నరాజు రాత్రి తమతో కలిసి పడుకున్నాడు. తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించటంతో వారు చుట్టపక్కల వారిని పిలిచారు. స్థానికులు మృతదేహాన్ని కిందికి దించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య కళమ్మ, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!