News March 19, 2024
ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ: సజ్జల

AP: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల యాత్రలు ఉంటాయి. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News July 8, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.
News July 8, 2025
‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్‌బాబు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్‌బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.
News July 8, 2025
15ఏళ్లు ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి!

అందరిలా 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని అనుకునేవారికి ప్రముఖ సీఏ కానన్ బహ్ల్ లింక్డ్ఇన్లో పలు సూచనలు చేశారు. పెరుగుతున్న ఖర్చులు, జీవనశైలి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం 45 ఏళ్లకే రిటైర్ అవుతారని, అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ‘ఫ్యూచర్ గురించి ఆలోచించి పొదుపును పెంచాలి. EPF & NPSలలో ఇన్వెస్ట్ చేయండి. ఇవి మీ డబ్బును ఎక్కువ కాలం బ్లాక్ చేసి దుర్వినియోగం చేయకుండా చూస్తాయి’ అని తెలిపారు.