News February 6, 2025

నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.

Similar News

News February 6, 2025

నేషనలిజం అనుసరించొద్దు.. మీ కామెంట్!

image

ఇంటర్ కనెక్టయిన ఈ ప్రపంచంలో నేషనలిజాన్ని అనుసరించడం సరికాదన్న ఇన్ఫోసిస్ నారాయణ <<15376856>>మూర్తి<<>> వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని విడిచిపెట్టాలనడం సరికాదని కొందరు అంటున్నారు. అసలు ఒక జాతిగా నిలబడని దేశం తన సొంత అస్థిత్వాన్ని కోల్పోతుందన్న మహనీయులు మాటలను గుర్తుచేస్తున్నారు. దేశభక్తికి ప్రధానమైనదే జాతీయవాదమని చెప్తున్నారు. మరికొందరు ఆయనకు మద్దతిస్తున్నారు. మీరేమంటారు?

News February 6, 2025

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఈయనే!

image

ఫ్రాన్స్‌కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్‌‌ని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గుర్తించారు. మాథ్యూపై విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు అతని పుర్రెకు 256 సెన్సార్లు బిగించి 12 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆయన ధ్యానం చేసినప్పుడు బ్రెయిన్ చార్టుల నుంచి గామా తరంగాల ఉత్పత్తి స్థాయిని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

News February 6, 2025

మా కలలన్నీ ఛిద్రమయ్యాయి: అక్రమ వలసదారుల కన్నీళ్లు

image

104మంది అక్రమ వలసదారుల్ని US తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు వారు పడిన బాధలు గుండెల్ని పిండుతున్నాయి. ‘చట్టప్రకారం అమెరికా తీసుకెళ్తామని ఏజెంట్ రూ.30 లక్షలు తీసుకున్నాడు. కానీ చట్ట విరుద్ధంగా బోర్డర్ దాటించాడు. దారిలో ఎన్నో ఘోరాలు చూశాం. ఎంతోమంది చనిపోయారు. ఎక్కడైతే బయలుదేరామో ఇప్పుడు తిరిగి అక్కడికే చేరాం. మా కలలన్నీ ఛిద్రమయ్యాయి’ అంటూ వారు కంటనీరు పెట్టుకుంటున్నారు.

error: Content is protected !!