News February 6, 2025

నటనలో ఎన్టీఆర్‌ను మించిన చంద్రబాబు: జగన్

image

AP: చంద్రబాబు నటనలో ఎన్టీఆర్‌ను మించిపోయారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని అన్నారు. 9 నెలల పాలన తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీగా మారిందని దుయ్యబట్టారు. చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పారు. CBN మోసాలను, అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

Similar News

News February 6, 2025

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

image

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా (కపిల్ దేవ్ తర్వాత రెండో క్రికెటర్) నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆయన ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఫీట్ సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను ఆయన అధిగమించారు.

News February 6, 2025

రాహుల్, ఖర్గేలతో భారీ సభలు: TPCC చీఫ్

image

TG: ఈ నెలాఖరులోగా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో, ఎస్సీ వర్గీకరణపై మెదక్‌లో ఖర్గేతో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించాం. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, కులగణనపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతలకు సూచించాం’ అని పేర్కొన్నారు.

News February 6, 2025

మంత్రులకు CM చంద్రబాబు ర్యాంకులు.. పవన్ కళ్యాణ్‌కు ఎంతంటే?

image

గతేడాది DEC వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబు 6, లోకేశ్ 8, పవన్ 10వ స్థానంలో ఉన్నారు.
ర్యాంకులు: ఫరూక్, దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల, DBV స్వామి, సత్యకుమార్, జనార్దన్ రెడ్డి, పవన్, సవిత, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, నారాయణ, భరత్, ఆనం, అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి, అనిత, సత్యప్రసాద్, నిమ్మల, పార్థసారథి, పయ్యావుల, వాసంశెట్టి

error: Content is protected !!