News February 6, 2025
BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్
AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.
Similar News
News February 6, 2025
GREAT: పండ్లు అమ్ముతూ జీవనం.. వచ్చిన లాభంతో అన్నదానం!
కేరళలోని త్రిసూర్‌లో జేసన్ పాల్ అనే వ్యక్తి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఆయన తనకొచ్చిన లాభంలో అధిక మొత్తాన్ని పేదల ఆకలి తీర్చేందుకు వెచ్చిస్తున్నారు. ఆయన వారంలో ఆరు రోజులు 100 నుంచి 150 మంది పేదలకు భోజనం అందిస్తున్నారు. పట్టలం రోడ్డులో రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. అన్నార్తుల ఆకలి తీర్చుతున్న జేసన్ పాల్ గొప్ప మనసును అభినందించాల్సిందే.
News February 6, 2025
ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు
TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ
AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.