News March 19, 2024
రేపు నూతన గవర్నర్ బాధ్యతల స్వీకరణ

TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళిసై రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Similar News
News August 28, 2025
మెగా డీఎస్సీ.. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

AP: డీఎస్సీ అభ్యర్థులకు ఇవాళ ఉ.9 గంటల నుంచి <<17519055>>సర్టిఫికెట్<<>> వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. కాల్ లెటర్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్లను సైట్‌లో అప్‌లోడ్ చేసి, తమకు కేటాయించిన తేదీ, సమయం, వేదికలో CVకి హాజరుకావాలని సూచించారు. వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని పేర్కొన్నారు.
News August 28, 2025
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు తెలంగాణ వర్సిటీలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ఇవాళ మీకు సెలవు ఉందా?
News August 28, 2025
వరద ప్రభావిత జిల్లాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ

TG: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నట్లు సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.