News February 7, 2025
ఈ నెల 14న రాష్ట్ర బంద్: మాల మహానాడు
TG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాయి.
Similar News
News February 7, 2025
ఆ కామెంట్స్ నేను పట్టించుకోను: హర్షిత్ రాణా
ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను దించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై రాణా స్పందించారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు. అవేవీ నేను పట్టించుకోదలచుకోలేదు. నా ఆటపైనే తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టను’ అన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన తర్వాతే తాను అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దానికి ముందుగానే సిద్ధమై ఉన్నానని తెలిపారు.
News February 7, 2025
ట్యాక్స్ బెన్ఫిట్స్‌తో ఇలా చేయండి: డా.ముఖర్జీ
కేంద్రం ట్యాక్స్ భారాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు డాక్టర్ ముఖర్జీ చిన్న సలహా ఇచ్చారు. ‘ట్యాక్స్ బెన్ఫిట్స్ వల్ల మిగిలిన అదనపు డబ్బును హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా పెట్టడం మంచి మార్గం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆస్పత్రి ఖర్చులు భరించడం కష్టం. సేవింగ్స్ మొత్తం ఖర్చవకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు చెప్పిరావు కాబట్టి ఏళ్ల తరబడి ఆదా చేసిన డబ్బు రోజుల్లో ఖాళీ అవుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.
News February 7, 2025
నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందనడం అబద్ధం: సోనూ సూద్
తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలు అబద్ధమని నటుడు సోనూ సూద్ ట్విటర్లో తెలిపారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్నారు. మాకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు వాడుతున్నారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోనున్నాం’ అని పోస్ట్ పెట్టారు.