News February 7, 2025

MUDA SCAM: సిద్దరామయ్యకు స్వల్ప ఊరట

image

ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు కొంత ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త నుంచి సీబీఐకి బదిలీ చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ‘లోకాయుక్త దర్యాప్తు బాగాచేయడం లేదనేలా, లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేయాలనేలా మెటీరియల్ ఎవిడెన్స్ ప్రతిబింబించడం లేదు’ అని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. దీంతో పిటిషనర్ స్నేహమయీ కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.

Similar News

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

News November 11, 2025

ఇతిహాసాలు క్విజ్ – 63

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 11, 2025

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు.. అప్లై చేశారా?

image

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌ల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST,SC, దివ్యాంగులకు మినహాయింపు కలదు. https://ner.indianrailways.gov.in/