News March 19, 2024
19 మంది వాలంటీర్లపై వేటు

AP: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. ‘సిద్ధం’ సభలో పాల్గొనడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లపై వేటు పడింది. అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇటు అనకాపల్లి(D)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. పల్నాడు(D) పెదకూరపాడులో పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌పై వేటు వేశారు.
Similar News
News August 28, 2025
ప్రకాశం బ్యారేజీకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద!

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 3.8లక్షల క్యూసెక్కుల వరద ఇవాళ ఉదయం కల్లా ప్రకాశం బ్యారేజీకి చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇది మరింత పెరగొచ్చని, మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశముందని చెప్పారు. పరీవాహక ప్రాంత ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News August 28, 2025
ఆగస్టు 28: చరిత్రలో ఈ రోజు

1934: దక్షిణ భారత దేశపు నేపథ్య గాయని ఎ.పి.కోమల జననం
1949: నటి డబ్బింగ్ జానకి జననం
1959: సినీ నటుడు సుమన్ జననం(ఫొటోలో)
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం
News August 28, 2025
సంజూ ఏ స్థానంలోనైనా ఆడుతాడు: మెంటార్ గోమెజ్

ఆసియా కప్‌కు సంజూ శాంసన్ ఎంపికైనా గిల్ రావడంతో తుది జట్టులో స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. గిల్ ఓపెనర్ కావడంతో శాంసన్‌ను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి తెరదించుతూ సంజూ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అతని మెంటార్ గోమెజ్ తెలిపారు. తన సామర్థ్యం ఏంటో శాంసన్‌కు తెలుసని, అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. కాగా కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.