News February 7, 2025

చేతిరాత మార్చుకోలేకపోయా: మోదీ

image

తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Similar News

News March 16, 2026

నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

image

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News March 16, 2026

ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది?

image

కొందరు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవాలని పదేపదే సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటుంటారు. దీని వల్ల చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్‌ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ముఖం ఎక్కువగా కడుక్కోవడం, తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.

News March 16, 2026

ఆగిన ఎగుమతులు.. కుప్పకూలిన అరటి ధరలు

image

AP: పశ్చిమాసియాలో యుద్ధంతో అరటి రైతులు కుదేలవుతున్నారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 2 వారాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ నెల ఆరంభంలో టన్ను ధర రూ.20-23వేలు ఉండగా ప్రస్తుతం రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. వార్ ఇలాగే కొనసాగితే రేట్లు మరింత పతనమవుతాయని అంచనా. రాయలసీమలో దాదాపు లక్ష ఎకరాల్లో అరటి సాగవుతుంది.