News February 7, 2025
మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలంటే..

RBI కత్తిరించిన 25bps వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. అయితే కొన్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని కొంతే తగ్గించొచ్చు. అలాంటప్పుడు మీ హోమ్‌లోన్ EMI తగ్గించుకొనేందుకు ఓ దారుంది. అదే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు మీ లోన్ బదిలీ చేసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఈ పోటీ వాతావరణంలో కస్టమర్‌ను వదులుకొనేందుకు ఏ బ్యాంకూ ఇష్టపడదు. మీరు బార్‌గెయిన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు.
Similar News
News September 17, 2025
హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

TG: రాష్ట్రంలో <<17740234>>ఆరోగ్యశ్రీ<<>> సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 87 శాతం హాస్పిటళ్లు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే సేవలు ఆగాయని పేర్కొన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ మరోసారి ఆయా ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున రోజుకు 844 సర్జరీలు నమోదవగా ఈరోజు 799 సర్జరీలు నమోదయ్యాయని వెల్లడించారు.
News September 17, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.