News February 7, 2025

మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలంటే..

image

RBI కత్తిరించిన 25bps వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. అయితే కొన్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని కొంతే తగ్గించొచ్చు. అలాంటప్పుడు మీ హోమ్‌లోన్ EMI తగ్గించుకొనేందుకు ఓ దారుంది. అదే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు మీ లోన్‌ బదిలీ చేసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఈ పోటీ వాతావరణంలో కస్టమర్‌ను వదులుకొనేందుకు ఏ బ్యాంకూ ఇష్టపడదు. మీరు బార్‌గెయిన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు.

Similar News

News March 25, 2025

రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

image

AP: రేపు రాష్ట్రంలోని <>108 మండలాల్లో<<>> వడగాలుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవాళ నంద్యాల (D) రుద్రవరంలో 41.6°C, ప్రకాశం (D) దరిమడుగులో 41.1°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. 15 మండలాల్లో వడగాలులు వీచాయంది. మరోవైపు అకాల వర్షం వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద నిలబడొద్దని చెప్పింది.

News March 25, 2025

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

image

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.

News March 25, 2025

దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

image

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.

error: Content is protected !!