News February 7, 2025
BCల జనాభా పెరిగింది: రేవంత్
TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని CM చెప్పారు.
Similar News
News February 8, 2025
7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.
News February 8, 2025
130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్‌గ్రేడ్
విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్‌ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్‌గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్‌బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్‌గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.
News February 8, 2025
పడుకునే ముందు ఇవి తాగుతున్నారా?
రోజూ పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి హాయిగా నిద్రపట్టేందుకు సహకరిస్తాయని అంటున్నారు. లావెండర్ టీ తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది. చమోమిలే టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. పిప్పరమెంట్ టీ కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. వేడి పాలలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్స్‌గా మారుతుంది.