News February 7, 2025
BCల జనాభా పెరిగింది: రేవంత్

TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని CM చెప్పారు.
Similar News
News March 19, 2025
రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు తిరుమలలో పర్యటించనున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ పయనమవుతారు.
News March 19, 2025
CBI, ED హోంశాఖ పరిధిలోకి రావు: అమిత్ షా

కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ హోంశాఖ పరిధిలోకి రావని ఆ శాఖ కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే సీబీఐ హోంమంత్రిత్వశాఖ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. దీనిపై అమిత్ షా స్పందించి సమాధానమిచ్చారు. సీబీఐపై తప్పుడు సమాచారం మానేయాలని హితవు పలికారు. గోఖలే ప్రస్తావిస్తున్న ఎన్నికల హింసలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైనవని తెలిపారు.
News March 19, 2025
2008 నుంచి IPL ఆడుతున్న వారు వీరే

ఇప్పటివరకు ఐపీఎల్లో వేలాది మంది క్రికెటర్లు ఆడారు. కానీ కొందరు మాత్రమే ఆరంభ సీజన్ నుంచి రాబోయే సీజన్లో కూడా ఆడబోతున్నారు. వీరిలో స్వప్నిల్ సింగ్, అజింక్య రహానే, మనీశ్ పాండే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికీ ఆడుతున్నారు. అందరూ భారతీయులే కావడం విశేషం. మరోసారి తమ ప్రదర్శనతో అలరించడానికి వీరు సిద్ధమవుతున్నారు.