News February 7, 2025
TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి
TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 8, 2025
హసీనా వ్యాఖ్యలతో భారత్‌కు సంబంధం లేదు: విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని భారత్‌లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమె వ్యాఖ్యలతో ఇండియాకు సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము ఎప్పుడూ కృషి చేస్తామన్నారు. బంగ్లా అంతర్గత వ్యవహారాలను INDకు ముడిపెట్టడం సరికాదని ఆ దేశ అధికారులకు తేల్చిచెప్పారు.
News February 8, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చిన విధంగానే భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం వస్తూ ఉంటాయి. పేదరికం, ఐశ్వర్యం శాశ్వతం కాదు.
News February 8, 2025
‘వందే భారత్’లో ఫుడ్.. రైల్వే కీలక నిర్ణయం
వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వే శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారికి కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అయితే రాత్రి 9 గంటలలోపు మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలి. ప్రయాణాల్లో ఆహారం దొరకడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRCTC పేర్కొంది. క్వాలిటీ ఫుడ్ అందించాలని సంబంధింత విభాగాలను ఆదేశించింది.