News February 7, 2025
TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి

TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 17, 2025
ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా నేటి నుంచే..

AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.
News March 17, 2025
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.
News March 17, 2025
మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.