News February 8, 2025

NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ గొడవ

image

ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇన్‌స్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

Similar News

News February 8, 2025

ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.

News February 8, 2025

ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

image

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.

News February 8, 2025

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?

image

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

error: Content is protected !!