News February 8, 2025

BREAKING: నిజామాబాద్‌: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.

Similar News

News February 8, 2025

కేన్ విలియమ్సన్ మరో ఘనత

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

News February 8, 2025

ములకలచెరువు ప్రమాదంలో మరొకరు మృతి

image

ములకలచెరువులో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని SI నరసింహుడు తెలిపారు. మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన సోమశేఖర్ భార్య కవిత, కొడుకు రెడ్డిశేఖర్(5), కుమార్తె సిద్దేశ్వరి కదిరిలో బంధువుల అంత్యక్రియలకు బైకుపై వెళ్తుండగా ములకలచెరువు వద్ద వాహనం ఢీకొట్టడంతో <<15397818>>తండ్రీ కుమార్తె చనిపోగా<<>>, భార్య, కుమారుడిని చికిత్త నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే రెడ్డిశేఖర్ చనిపోయాడు.

News February 8, 2025

వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి రక్షించాలని వైద్యశాఖ అధికారులను సూచించారు.

error: Content is protected !!