News February 8, 2025
కేన్ విలియమ్సన్ మరో ఘనత

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.
Similar News
News March 24, 2025
కాస్త తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.
News March 24, 2025
5 స్టార్ ఏసీ వాడితే.. 60 శాతం కరెంట్ ఆదా

5 స్టార్ రేటెడ్ ACలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) సౌత్ఇండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో వాడుతున్న ACల్లో అత్యధికం 8ఏళ్ల కంటే పాతవని, ఇవి 40-50% విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెప్పాయన్నారు. ACని 24°C వద్ద వాడటం ఉత్తమమన్నారు. 5స్టార్ రేటెడ్ ACలతో భూతాపాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ హౌజ్ గ్యాసెస్‌ని అరికట్టవచ్చని తెలిపారు.
News March 24, 2025
మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న జెఫ్ బెజోస్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికల పంపిణీ మెుదలు పెట్టారు. ఇటలీ వెనిస్‌లో వీరి మ్యారేజ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ వివాహ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. 2023లో వీరి నిశ్చితార్థం జరిగింది. జెఫ్ బెజోస్ 2019తో తన మెుదటి భార్య మెకెంజీతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.