News February 8, 2025

ట్విటర్‌లో ‘EVM HACK’ ట్రెండింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న వేళ ‘EVM HACK’ హాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వైపు ఉన్నారని, ఫలితాలు సరైనవి కావంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. EVMలను హ్యాక్ చేసే అవకాశం ఉందనే అమెరికాలో బ్యాలెట్ ఓటింగ్ పెట్టారంటున్నారు. అయితే, మరికొందరు ‘ఓటమిని అంగీకరించకుండా ఇప్పుడు EVM హ్యాక్ అయిందని పోస్టులు పెడతారు’ అని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News March 8, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఒక్క రోజే ఛాన్స్!

image

రైల్వేలో 22,195 గ్రూప్‌-D ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 1,012 పోస్టులున్నాయి. రైల్వే అధికారిక <>వెబ్‌సైట్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు.

News March 8, 2026

అన్నింటా నువ్వే.. వందనాలమ్మా!

image

ఆమె.. మల్టీ టాస్కింగ్ చేయగల నేర్పరి. తల్లిగా, భార్యగా, కోడలిగా ఏకకాలంలో బాధ్యతలు నెరవేర్చగల ఎక్స్‌పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త. ఓపిక ఆమె బలం.. సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవం. అవకాశాల్ని అందిపుచ్చుకుని, అడ్డంకులను దాటుకుని, తమను తాము నిరూపించుకుని ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

News March 8, 2026

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

image

చమురు ఉత్పత్తి, ఎగుమతులను నిలిపేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి మూతతో ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు అనుకూలించాక ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. OPECలో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కువైట్. సగటున రోజుకు 2.6M బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఖతర్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. UAE కూడా క్రూడాయిల్ ప్రొడక్షన్‌ కట్ చేస్తున్నట్లు తెలిపింది.