News February 8, 2025

ట్విటర్‌లో ‘EVM HACK’ ట్రెండింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న వేళ ‘EVM HACK’ హాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ వైపు ఉన్నారని, ఫలితాలు సరైనవి కావంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. EVMలను హ్యాక్ చేసే అవకాశం ఉందనే అమెరికాలో బ్యాలెట్ ఓటింగ్ పెట్టారంటున్నారు. అయితే, మరికొందరు ‘ఓటమిని అంగీకరించకుండా ఇప్పుడు EVM హ్యాక్ అయిందని పోస్టులు పెడతారు’ అని సెటైర్లు వేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 13, 2026

‘జైలర్-2’ రిలీజ్ డేట్ అదేనా?

image

రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు నటిస్తున్నారు. షారుఖ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.