News February 8, 2025

సచిన్, కోహ్లీ పేరిట రైల్వే స్టేషన్లు.. ఎక్కడంటే?

image

భారత క్రికెట్ దిగ్గజాలైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీల పేర్లతో ఇండియాలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ‘సచిన్ రైల్వే స్టేషన్’ ఉంది. ఇది ముంబై- అహ్మదాబాద్- జైపూర్ – ఢిల్లీ ప్రధాన మార్గంలో ఉంటుంది. నాగ్‌పూర్ రైల్వే డివిజన్‌లో భోపాల్-నాగ్‌పూర్ సెక్షన్‌లో ‘కోహ్లీ రైల్వే స్టేషన్’ ఉంది. అయితే, వీరిద్దరూ పుట్టకముందు నుంచే ఈ స్టేషన్లు అక్కడుండటం గమనార్హం.

Similar News

News March 25, 2026

సమ్మర్ షాక్.. పెరగనున్న ACల ధరలు

image

ఈ వేసవిలో ACల ధరలు 8% నుంచి 12% వరకు పెరగనున్నాయి. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త BEE (Bureau of Energy Efficiency) ఎనర్జీ రేటింగ్ నిబంధనల వల్ల తయారీ ఖర్చు పెరిగింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో కాపర్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కంపెనీలపై భారాన్ని పెంచాయి. ఈ అదనపు వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు ధరలను పెంచుతున్నాయి.

News March 25, 2026

ఇందిరమ్మ ఇండ్లు.. లక్ష దాటిన శ్లాబులు

image

TG: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,13,365 ఇళ్ల శ్లాబులు పూర్తయినట్లు హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు లబ్ధిదారులకు ₹5,376.22 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 2.65 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వర్క్ ప్రోగ్రెస్‌ను బట్టి ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొంది.

News March 25, 2026

ఇరాన్ మైండ్ గేమ్: చమురు అస్త్రం సక్సెస్?

image

అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధంతో కలిగించే నష్టాల కంటే సుదీర్ఘ ఘర్షణతో గ్లోబల్ ఆయిల్ సంక్షోభం సృష్టించాలనే ఇరాన్ మైండ్ గేమ్ ఫలించిందని నిపుణులు అంటున్నారు. ఇంధన కొరత భయంతో ట్రంప్ వెనక్కి తగ్గడం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును అంగీకరించడం ఆ దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. నాయకత్వ మార్పు కోరుకున్న US చివరకు అదే నాయకత్వంతో రాజీకి రావడం ఇరాన్ సక్సెస్‌ను చాటిచెబుతోంది.