News February 8, 2025
సచిన్, కోహ్లీ పేరిట రైల్వే స్టేషన్లు.. ఎక్కడంటే?

భారత క్రికెట్ దిగ్గజాలైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీల పేర్లతో ఇండియాలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో ‘సచిన్ రైల్వే స్టేషన్’ ఉంది. ఇది ముంబై- అహ్మదాబాద్- జైపూర్ – ఢిల్లీ ప్రధాన మార్గంలో ఉంటుంది. నాగ్‌పూర్ రైల్వే డివిజన్‌లో భోపాల్-నాగ్‌పూర్ సెక్షన్‌లో ‘కోహ్లీ రైల్వే స్టేషన్’ ఉంది. అయితే, వీరిద్దరూ పుట్టకముందు నుంచే ఈ స్టేషన్లు అక్కడుండటం గమనార్హం.
Similar News
News March 17, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కు వాయిదా వేసింది.
News March 17, 2025
కొత్త ఏడాది రాశిఫలాలు..

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.
News March 17, 2025
పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.