News March 19, 2024

కాకినాడ నుంచే ఎందుకు?

image

AP: కాకినాడ లోక్‌సభ స్థానంలో జనసేన తరఫున ఉదయ్ బరిలోకి దిగుతున్నారు. కాగా ఈ పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. గతంలో ఇక్కడ అత్యధిక సార్లు కాపు అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 1,32,648, TDPకి 5,11,892 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం YCP అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు.

Similar News

News July 5, 2024

14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్

image

బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.

News July 5, 2024

రిషి సునాక్ ఓటమి.. మరోసారి మూర్తి సలహా వైరల్!

image

యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యూకే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో సెటైర్లు వేస్తున్నారు. తన మామగారి సలహాను పాటించకపోవడంతోనే రిషి ఓడిపోయారేమోనంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మూర్తి చెప్పిన సూత్రాన్ని UKలో అమలు చేస్తారేమోనని ఓడించారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News July 5, 2024

రక్షణ ఉత్పత్తుల్లో రికార్డు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 2022-23తో పోలిస్తే ఏకంగా 16.8% పెరిగినట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భరత లక్ష్యాన్ని చేరుకోవడంలో PM ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ ఘనత సాధించినందుకు రక్షణ శాఖకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.