News March 19, 2024
కాకినాడ నుంచే ఎందుకు?
AP: కాకినాడ లోక్‌సభ స్థానంలో జనసేన తరఫున ఉదయ్ బరిలోకి దిగుతున్నారు. కాగా ఈ పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. గతంలో ఇక్కడ అత్యధిక సార్లు కాపు అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 1,32,648, TDPకి 5,11,892 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం YCP అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు.
Similar News
News September 12, 2024
మనుషుల నుంచీ కాంతి వెలువడుతోంది!
మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.
News September 12, 2024
హరియాణా అసెంబ్లీ రద్దు
హరియాణా అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉత్తర్వులు జారీ చేశారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.
News September 12, 2024
ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది?: అంబటి రాంబాబు
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.