News February 8, 2025

కేన్ విలియమ్సన్ మరో ఘనత

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.

Similar News

News February 9, 2025

భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే?

image

ఓ వ్యక్తి భార్యపై కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్‌పై చలానాలు వచ్చేట్లు ప్రవర్తించాడు. పట్నాకు చెందిన ఓ వ్యక్తి ముజఫర్‌పూర్‌కు చెందిన యువతి పెళ్లైన నెలన్నరకే విడిపోయారు. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆమెపై కోపంతో అత్తింటి వారు ఇచ్చిన బైక్‌ను భర్త ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ నడిపాడు. బైక్ ఆమె పేరుతో ఉండటంతో చలాన్లు ఆ యువతి ఫోన్‌కు వెళ్లేవి. చలాన్లు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News February 9, 2025

ఒంటరిగా ఉంటున్నారా?

image

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

News February 9, 2025

రోహిత్‌ శర్మ రాణించాలని అభిమానుల పూజలు

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!