News February 8, 2025

సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

image

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్‌స్టా చాట్‌లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్‌షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.

Similar News

News March 14, 2026

పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

image

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.

రోహిత్‌కు హార్దిక్ వార్నింగ్?.. MI రియాక్షన్ ఇదే

image

ఈ ఏడాది IPL ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు MI కెప్టెన్ హార్దిక్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ స్పోర్ట్స్ అకౌంట్ ట్వీట్ చేసింది. హిట్ మ్యాన్ ప్రదర్శన సరిగా లేకపోతే సహించేది లేదని పాండ్య మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు పేర్కొంది. దీనిపై MI స్పందించింది. ‘ఏమైనా రాసుకోవచ్చు’ అనే అర్థంలో నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేసింది. ఇలాంటి రూమర్స్‌ను పుట్టించడం సాధారణమై పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.