News February 8, 2025
సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్‌స్టా చాట్‌లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్‌షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.
Similar News
News February 13, 2026
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాకుంటే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘విశ్వేశ్వర’’

విశ్వం అంటే అనంతమైన బ్రహ్మాండం. ఈశ్వర అంటే పాలకుడు. ఈ సృష్టిలోని ప్రతి అణువుకూ, ప్రతి జీవికీ శివుడే ఆధారం. కాలాతీతుడైన ఆయన సమస్త లోకాలను శాసిస్తాడు. కాశీలో ఆయన ‘విశ్వేశ్వరుడు’గా కొలువై భక్తులకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కాశీలో మరణించే ప్రతి జీవి చెవిలో ఆయన తారక మంత్రాన్ని ఉచ్ఛరించి ముక్తిని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ కాబట్టి ఆయన ‘విశ్వేశ్వరుడు’.
News February 13, 2026
బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయండి: అవామీ లీగ్

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని నిషేధిత అవామీ లీగ్ పార్టీ డిమాండ్ చేసింది. నియంత యూనస్ నిర్వహించిన ఈ ఎలక్షన్స్ హాస్యాస్పదమని పేర్కొంది. నిన్న 3 గంటల వ్యవధిలో 14.96% ఓటింగ్ నమోదవ్వడం ప్రజా వ్యతిరేకతను చూపించిందని ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రాబోయే రోజుల్లో అవామీ లీగ్ మద్దతుదారులపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాహిత ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరింది.


