News March 19, 2024

వాట్సాప్‌.. త్వరలో 60 సెకన్ల స్టేటస్ ఫీచర్‌

image

యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 30 సెకన్ల వీడియోను స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండగా, దాన్ని 60 సెకన్లకు పెంచనుంది. అలాగే UPI ద్వారా వేగంగా చెల్లింపు చేసేందుకు మరో ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యాప్‌లో త్రిడాట్స్‌పై సెలక్ట్ చేసి, ఆ తర్వాత QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంది. ఇకపై నేరుగా QR కోడ్‌ను స్కాన్ చేసేలా షార్ట్ కట్ ఆప్షన్ ఇవ్వనుంది.

Similar News

News January 9, 2025

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

image

TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

News January 9, 2025

BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్

image

BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

News January 9, 2025

Results Season: నష్టాలు తెచ్చాయి..!

image

స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా న‌ష్ట‌పోయాయి. కార్పొరేట్ సంస్థ‌లు Q3 ఫ‌లితాలు ప్ర‌క‌టించే సీజ‌న్ ప్రారంభంకావ‌డంతో ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. సెన్సెక్స్ 442 పాయింట్లు న‌ష్ట‌పోయి 77,681 వ‌ద్ద‌, నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. India Vix 14.69గా ఉంది. రియ‌ల్టీ, IT, మెట‌ల్‌, PSU బ్యాంక్స్‌, ఫైనాన్స్‌ రంగాలు న‌ష్ట‌పోయాయి. BAJAJ Auto టాప్ గెయినర్.