News March 19, 2024
వాట్సాప్.. త్వరలో 60 సెకన్ల స్టేటస్ ఫీచర్
యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 30 సెకన్ల వీడియోను స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండగా, దాన్ని 60 సెకన్లకు పెంచనుంది. అలాగే UPI ద్వారా వేగంగా చెల్లింపు చేసేందుకు మరో ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యాప్‌లో త్రిడాట్స్‌పై సెలక్ట్ చేసి, ఆ తర్వాత QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంది. ఇకపై నేరుగా QR కోడ్‌ను స్కాన్ చేసేలా షార్ట్ కట్ ఆప్షన్ ఇవ్వనుంది.
Similar News
News September 13, 2024
మూత్రం, మురుగు నీటి నుంచి బీర్ తయారీ!
సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.
News September 13, 2024
పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్.. గరిష్ఠంగా రూ.10 వేలే సబ్సిడీ: కేంద్రమంత్రి
విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.
News September 13, 2024
బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్
బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్‌ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్‌లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.