News March 19, 2024

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి ఊరట

image

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022లో అధికారం కోల్పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆయన లాంగ్ మార్చ్ నిర్వహించారు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన విధ్వంసానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారించిన ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు ఆయనను తాజాగా నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Similar News

News July 5, 2024

MLCలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.

News July 5, 2024

సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తా: CBN

image

TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.

News July 5, 2024

14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్

image

బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.